పీఎం శ్రీ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు: మహబూబ్ నగర్ కలెక్టర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల్లో ఉన్న కేంద్రం నిధులను నిబంధనల ప్రకారం వినియోగించి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

వచ్చే వారం లోగా నిధులను పూర్తి స్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. డ్రైనేజీ, గేట్లు, తలుపులు, కిటికీలు, ఫ్యాన్లు, లైట్లు, ర్యాంపులు తదితర సౌకర్యాల్లో చిన్నపాటి లోపాలు కూడా లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. బాలికల మరుగుదొడ్లలో తలుపులు, లైట్లు వంటి సౌకర్యాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ఫ్యాన్లు పనిచేసేలా చూడాలని సూచించారు. తలుపులు, కిటికీలు, ర్యాంపులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని తెలిపారు.

పాఠశాలల్లో తనిఖీలు..

పీఎం శ్రీ పాఠశాలలకు నిధుల విషయంలో ఎలాంటి సమస్య లేదని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. కేవలం ఖర్చు చేసినట్లు చూపించడం కాకుండా, వాటి వినియోగంతో పాఠశాలల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వచ్చే వారం నుంచి తన పర్యటనల్లో పీఎం శ్రీ పాఠశాలలకు ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాలల వారీగా అవసరాలను ముందుగానే గుర్తించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎం శ్రీ నిధులతో చేపట్టిన ప్రతి పనికి సంబంధించిన ఖర్చుల వివరాలను పాఠశాల రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.

మరమ్మతు పనులకు ముందు, తర్వాత ఫొటోలు తీసి, వాటితో పాటు తేదీ, జీపీఎస్ కోఆర్డినేట్ల వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. ఇంజినీరింగ్ పనులకు సంబంధించిన ఫైళ్లలో కూడా ఇదే విధానం వర్తిస్తుందన్నారు. విద్యార్థులకు వాస్తవంగా స్వీయ రక్షణ నైపుణ్యాలు అందుతున్నాయా లేదా పరిశీలించాలని, శిక్షణ సామగ్రి, ఇతర వసతులను సమర్థవంతంగా వినియోగించి కార్యక్రమాన్ని ప్రయోజనకరంగా నిర్వహించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనీ) సాయి శివాని తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>