చితకొట్టిన సంజూ.. ఢిల్లీపై చెన్నై ఘన విజయం

కలం, వెబ్ డెస్క్:  ఢిల్లీని హోంగ్రౌండ్‌లోనే చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) చితకొట్టాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో బౌండరీల మోతమోగించాడు. సంజూ అద్భతమైన ఆటతో ఢిల్లీ ఇచ్చిన టార్గెట్‌ను చెన్నై 2 వికెట్ల నష్టానికే ఛేదించింది. కేవలం 52 బంతులు ఎదుర్కొన్న ఈ కేరళ స్టార్.. 6 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో స్టేడియంను హోరెత్తించాడు. సంజూ వీరవిహారంతో (87 నాటౌట్) చెన్నై సూపర్ కింగ్స్ మరో 15 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో ఢిల్లీపై ఘన విజయం సాధించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఆరంభంలోనే షాకులు తగిలాయి. పాతుమ్ నిస్సంక (19), కెప్టెన్ కేఎల్ రాహుల్ (12) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. నితీష్ రాణా (15), కరుణ్ నాయర్ (13) నిరాశపరచగా, అక్షర్ పటేల్ (2) దారుణంగా విఫలమయ్యాడు. 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును సమీర్ రిజ్వీ (40 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (38) ఆదుకున్నారు. ఆఖర్లో అశుతోష్ శర్మ 5 బంతుల్లో 2 సిక్సర్లతో 14 పరుగులు పిండుకోవడంతో ఢిల్లీ 155 పరుగులు చేయగలిగింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

లక్ష్య ఛేదనలో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6) త్వరగానే అవుట్ అయినా, సంజూ శాంసన్ (Sanju Samson) బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. ఉర్విల్ పటేల్ (17) రెండు సిక్సర్లు బాది అవుట్ అయిన తర్వాత, కార్తీక్ శర్మ (41 నాటౌట్) తో కలిసి సంజూ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 114 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఢిల్లీ బౌలర్లలో నటరాజన్ 2.3 ఓవర్లలోనే 39 పరుగులు సమర్పించుకోగా, కుల్దీప్ యాదవ్ సైతం 11కు పైగా ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. సంజూ బ్యాటింగ్ పవర్‌కు ఢిల్లీ బౌలర్లు నిస్సహాయంగా ఉండిపోయారు.

Read Also: మే 2026లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? భారీ రాబడినిచ్చే టాప్ ఎస్‌ఐపీలు ఇవే!

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>