బీ అలర్ట్.. మూడు రోజుల పాటు పిడుగులతో వర్షాలు

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎండలు మండుతుంటే.. మరోవైపు అకాల వర్షం అన్నదాతలను భ్రయాబంతులకు గురి చేస్తోంది. వరికోతలు చివరి దశలో ఉన్న సమయంలో  వర్షాలు రావడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో వచ్చే మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు (Thunderstorm Alert)  కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

అల్పపీడన ద్రోణీ ప్రభావంతో బుధవారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు. శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే పిడుగులు పడే సమయంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

మరోవైపు విజయనగరం జిల్లా రాజాం మండలంలోని గెడ్ల వలస గ్రామంలో మంగళవారం పిడుగు పడి ముగ్గురు మహిళా కూలీలు చనిపోయారు. వర్షం పడే సమయంలో వారు చెట్టు కింద ఉన్న సమయంలో ఆకస్మాత్తుగా పిడుగు పడడంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో . ఉరుములతో కూడిన వర్షం (Thunderstorm Alert) పడే సమయంలో పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Read Also: మే 2026లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? భారీ రాబడినిచ్చే టాప్ ఎస్‌ఐపీలు ఇవే!

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>