Mobile Popup Ad
Mobile Popup Ad

ధోనీకి ఫెదరర్‌ పోలిక.. కోహ్లీకి అల్కరాజ్ ట్యాగ్ : సంజూ శాంసన్

కలం, వెబ్ డెస్క్ : టెన్నిస్ ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ దిగ్గజాలను టెన్నిస్ స్టార్లతో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఆటతీరు, ప్రశాంతతను గుర్తుచేస్తూ.. ఆయనను టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్‌తో (Roger Federer) పోల్చారు. ఫెదరర్ ఆటలా ధోనీ ఆట కూడా ఎంతో సులభంగా కనిపించినా, అంతే శక్తివంతంగా ఉంటుందని అన్నారు. అలాగే స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని (Virat Kohli), స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్‌తో(Carlos Alcaraz) పోల్చారు. కెరీర్ ఆరంభంలో కోహ్లీ కూడా అల్కరాజ్‌లాగే దూకుడు, పవర్‌తో ఆటను ఆకట్టుకునేవారని సంజూ తెలిపారు.

ఇక భారత జట్ల విజయాలపై స్పందిస్తూ.. మహిళల జట్టు ప్రపంచకప్ విజయం తమకు స్ఫూర్తినిచ్చిందని, ఆ తర్వాతే తాము స్వదేశంలో టీ20 ప్రపంచకప్ గెలిచామని చెప్పారు. ఆ విజయ క్షణాలు దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా జట్టుపై మాట్లాడుతూ.. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను ఏలిన జట్టు ఇప్పుడు వెనుకబడిందని, ప్రస్తుతం తామే ఛాంపియన్‌లమని  ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు భారత మాజీ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న వింబుల్డన్ విజేతలపై అంచనాలు వెల్లడించారు. మెన్స్ సింగిల్స్‌లో జాన్నిక్ సినెర్, ఉమెన్స్ సింగిల్స్‌లో ఎలెనా రిబాకినా విజయం సాధిస్తారని అభిప్రాయపడ్డారు. ఫెదరర్, నాదల్, జకోవిచ్‌లతో ఒకే లాకర్ రూమ్ పంచుకోవడం తనకైతే కల నెరవేరినట్లేనని బోపన్న అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>