ఆ ఇద్దరి కుట్రతోనే మా ఎంపీలు పార్టీ మారారు: ఆప్

కలం, వెబ్ డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. రాఘవ్ చద్దాతోపాటు మరో ఆరుగురు ఎంపీలు ఆప్‌కు గుడ్ బై చెప్పబోతున్నారు. రాఘవ్ చద్దా (Raghav Chadha) సొంతపార్టీపై చాలా రోజులుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన పార్టీ మారబోతున్నారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆయనతోపాటు మరికొందరు ఎంపీలు కూడా పార్టీ మారడం గమనార్హం. ఈ పరిణామాలపై ఆప్ స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh) తీవ్రంగా స్పందించారు. ‘పంజాబ్ ప్రజలు వెన్నుపోటు పొడిచిన ద్రోహులను ఎప్పటికీ మర్చిపోరు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పంజాబ్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే కుట్ర

బీజేపీ “ఆపరేషన్ లోటస్” పేరుతో పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే కుట్ర చేస్తోందని సంజయ్ సింగ్ ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఈ కుట్రకు తెరలేపారని ఫైర్ అయ్యారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ఉపయోగించి ఆపరేషన్ లోటస్ నడుపుతున్నారంటూ మండిపడ్డారు. పంజాబ్ ప్రజలు ఈ ద్రోహులను ఎప్పటికీ మర్చిపోరని విమర్శించారు. అదే సమయంలో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. “బీజేపీ మరోసారి పంజాబ్ ప్రజలను వెనక్కి నెట్టింది” అని ఆయన (Sanjay Singh) వ్యాఖ్యానించారు.

రైతు చట్టాలపై పోరాటం చేయగలరా?

ఆప్‌ను వీడి బీజేపీలో చేరుతున్న ఎంపీలు రైతు చట్టాల గురించి మాట్లాడగలరా? అంటూ ప్రశ్నించారు. వారంతా బీజేపీ ట్రాప్‌లో పడ్డారని.. బీజేపీకి సరెండర్ అయ్యారని ఫైర్ అయ్యారు. “ఆమ్‌ ఆద్మీ పార్టీ చద్ఢాకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు ఇచ్చింది. కానీ ఆయన చివరికి బీజేపీ ఒడిలో చేరారు. ఇది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమే అని ఆయన వ్యాఖ్యానించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వ మంచి పనులను బీజేపీ అడ్డుకుంటోందని కూడా సంజయ్ సింగ్ ఆరోపించారు. పంజాబ్ ప్రజలు ఈ ఏడుగురి పేర్లను గుర్తుంచుకోవాలి. వారిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అంటూ ఆయన పేర్కొన్నారు.

Read Also: బెంగాల్ లో దీదీ ఓటమి ఖాయం: అమిత్ షా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>