కలం, వెబ్ డెస్క్ : ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవవహరిస్తోంది అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు (Ramchander Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధనకు పోరాడుతున్న ఆర్టీసీ కార్మికుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 41 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వరంగల్ నర్సంపేట డిపో బస్ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన (Ramchander Rao) దుయ్యబట్టారు. తక్షణమే బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించాలని రామచందర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కార్మికుల ప్రధాన డిమాండ్ ను వెంటనే నెరవేర్చాలన్నారు. దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని ఆయన ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కార్మికుల పోరాటానికి బీజేపీ అండగా ఉంటుంది అని రామచందర్ రావు భరోసానిచ్చారు.
Read Also: ఆర్టీసీ జేఏసీతో సర్కార్ చర్చలు.. ఆ డిమాండ్స్ కి గ్రీన్ సిగ్నల్
Follow Us On : WhatsApp

