Mobile Popup Ad
Mobile Popup Ad

పాము ఇంట్లోకి దూరింది.. 18 గుడ్లు పెట్టింది!

కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెంలో (Kothagudem) నివాసం ఉంటున్న డ్రైవర్ చల్ల రాములు ఇంట్లోకి రాత్రి తాచుపాము దూరింది. సమాచారం ఇవ్వడంతో వెంటనే స్నేక్ రెస్క్యూ టీమ్ సభ్యులు స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకొని పామును జాగ్రత్తగా పట్టుకుని బంధించారు. శుక్రవారం పామును సమీపంలోని అడవిలో వదిలేయడానికి వెళ్ళి డబ్బాను ఓపెన్ చేసి చూడగా, అందులో పాముతో పాటు 18 గుడ్లు కనిపించాయి. అంటే రాత్రి పాము గుడ్లు పెట్టేందుకే చోటు కోసం వెతుక్కుంటూ ఇంట్లోకి దూరిందని రెస్క్యూ టీమ్ సభ్యులు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాచుపాము సాధారణంగా 10 నుంచి 50 గుడ్లు పెడతాయన్నారు. అలాగే 70 రోజుల్లో గుడ్లు పగిలి పిల్లలు బయటకు వస్తాయన్నారు. అప్పటి వరకూ పాము (Snake) గుడ్లకు కాపలా ఉంటుందన్నారు. వేసవికాలం నేపథ్యంలో పాములు చల్లదనం కోసం ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి రాత్రి సమయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read Also: ఆ ఇద్దరి కుట్రతోనే మా ఎంపీలు పార్టీ మారారు: ఆప్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>