Mobile Popup Ad
Mobile Popup Ad

పారిశుద్ధ్య కార్మికురాలి మృతి.. హైదరాబాద్‌లో ఉద్రిక్తత

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని అంబర్‌పేట అలీ కేఫ్ చౌరస్తాలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలిని (Sanitation Worker Dies) బస్సు ఢీ కొట్టడంతో టైర్ కింద పడి ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలు అంబర్‌పేట అలీ కేఫ్ చౌరస్తాలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలుగా విధులు నిర్వహిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అంబర్‌పేట్ పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ (GHMC) కార్మికులు ధర్నా చేపట్టారు. విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పుష్పకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు గంటసేపటి నుంచి మృతదేహాన్ని తరలించవద్దని.. ఆమెకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న క్లూస్ టీం.. స్థలానికి చేరుకుకొని ఆధారాలు సేకరిస్తోంది.

Read Also:  సీట్లు 400.. అప్లికేష‌న్లు 4,000.. ఆ స‌ర్కారు బ‌డిలో అడ్మిషన్ల జాత‌ర‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>