కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి(Mahipal Reddy)కి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన తన ఇంట్లోని బాత్ రూమ్ లో జారిపడ్డారు. ఈ అనుహ్య ప్రమాదంతో ఆయన వెన్నుముక భాగంలో తీవ్రమైన గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడి వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందుతోంది.
వెన్నుముకకు గాయం కావడంతో వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ విషయం తెలిసి పటాన్‌చెరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపిస్తున్నారు.
Read Also: కాలం కన్నా ముందు పుట్టిన పురాతన అడవులు.. మనం కూడా చూడొచ్చు..
Follow Us On: X(Twitter)

