Mobile Popup Ad
Mobile Popup Ad

MG వర్సిటీకి వేసవి సెలవులు.. ఎప్పటినుంచంటే?

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) లోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MG University) పరిధిలోని విద్యార్థులకు వర్సిటీ యంత్రాంగం వేసవి సెలవులను ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని పీజీ కాలేజీలకు సెలవులు వర్తిస్తాయని రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి (Koppula Anji Reddy) ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయంలోని రిజిస్ట్రార్ కార్యాలయం, ఎగ్జామ్ బ్రాంచ్, ప్రిన్సిపాల్, ఇతర కార్యాలయాలు యధావిధిగా తమ విధులను నిర్వర్తిస్తాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. జూన్ 1 నుంచి మళ్లీ కాలేజీలు ప్రారంభమవుతాయని అన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు జూన్ 1 నాటికి తిరిగి కళాశాలలకు హాజరుకావాలని వర్సిటీ అధికారులు సూచించారు.

Read Also: కల్వకుంట్ల ఫ్యామిలీలో పొలిటికల్ వార్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>