కలం, స్పోర్ట్స్: లాహోర్ ఖలందర్స్ స్టార్ బ్యాటర్ ఫకర్ జమాన్ (Fakhar Zaman) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 11వ సీజన్‌లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జమాన్ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. మంగళవారం గడ్డాఫీ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో కేవలం 51 బంతుల్లోనే 103 పరుగులు సాధించి తన జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో పీఎస్ఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా బాబర్ ఆజం (Babar Azam) రికార్డును జమాన్ సమం చేశాడు. లీగ్‌లో ఇది అతనికి మూడవ శతకం. గత ఆదివారమే బాబర్ ఆజం సైతం గ్లాడియేటర్స్‌పైనే తన మూడో సెంచరీ నమోదు చేయడం విశేషం. వీరితో పాటు ఉస్మాన్ ఖాన్, కమ్రాన్ అక్మల్, రిలీ రోసో కూడా తలో మూడు సెంచరీలతో ఈ జాబితాలో ఉన్నారు.
ఈ మ్యాచ్ ద్వారా జమాన్ మరికొన్ని మైలురాళ్లను అందుకున్నాడు. గడ్డాఫీ స్టేడియంలో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా, పీఎస్ఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తన రికార్డును మరింత సుస్థిరం చేసుకున్నాడు. 2017 నుంచి లాహోర్ ఖలందర్స్ కే ప్రాతినిధ్యం వహిస్తున్న అతను, ఇప్పటివరకు ఆ జట్టు తరపున 3,200కు పైగా పరుగులు సాధించాడు. ప్రస్తుతం పీఎస్ఎల్ ఓవరాల్ రన్ చార్ట్స్‌లో 3,246 పరుగులతో జమాన్ రెండో స్థానంలో ఉన్నాడు. 3,792 పరుగులతో బాబర్ ఆజం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫకర్ జమాన్ (Fakhar Zaman) తన నిలకడైన ఆటతీరుతో మరోసారి జట్టు విజయాల్లో కీలక శక్తిగా నిరూపించుకున్నాడు.
Read Also: కాలం కన్నా ముందు పుట్టిన పురాతన అడవులు.. మనం కూడా చూడొచ్చు..
Follow Us On : WhatsApp

