అంద‌రూ కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేయాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన గెల్లు చంద్రశేఖర్ శ‌నివారం రాజారాం పల్లి గ్రామంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులు మండలంలోని అన్ని గ్రామాల్లో కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీ అధిష్టానం సూచనలు పాటిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మండలంలో పార్టీ బలోపేతానికి పని చేయాలని మంత్రి సూచించారు. గతంలో పని చేసిన నాయకులతో పాటు కార్యకర్తలను విస్మరించకుండా పార్టీ నియమాలకు లోబడి పని చేస్తూ వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చాలని మంత్రి సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>