కలం, వెబ్ డెస్క్: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) హోమ్ బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న సరికొత్త చిత్రం రోమాంచకం (Romanchakam) గురించి సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. సుమంత్ ప్రభాస్, అనంతిక ప్రధాన పాత్రల్లో వంగా ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా స్వయంగా సమర్పిస్తుండటం విశేషం. కథా విశ్లేషణ వింటున్నంత సేపు తాను మనస్ఫూర్తిగా నవ్వుకున్నానని, వినోదంతో పాటు ఈ కథలో బలమైన ఎమోషన్ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక వినూత్నమైన మ్యూజికల్ రొమాంటిక్ కామెడీగా రాబోతున్న ఈ సినిమా ద్వారా తమ ప్రయాణం ఎంతో ఉత్సాహంగా ఉండబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

