కలం, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ డేట్ (Fauzi Release Date ) ను ఖరారు చేశారు. యుద్ధం కాన్సెప్ట్ తో పీరియాడిక్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.
ప్రభాస్ షర్ట్ లేకుండా గన్ పట్టుకుని రక్తపాతం సృష్టించి ఒళ్లంతా రక్తంతో అలిసి కూర్చున్నట్లు కనిపిస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్ (Fauzi Release Date) అడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. అంతేకాదు పోస్టర్ లో వేసిన ఓ స్టాంప్ వేసి ఉండగా.. అందులో అజ్ఞాత పర్వం, మోస్ట్ వాంటెడ్ 1932 అని కనిపిస్తుంది. దీంతో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు స్టోరీతో వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Read Also: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం: ఫెడరేషన్ కీలక నిర్ణయం?
Follow Us On: Instagram

