కరెంట్ కష్టాలు.. విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించిన గ్రామస్తులు

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని కోహీర్ మండలం దిగ్వాల్ విద్యుత్ సబ్ స్టేషన్ (Digwal Power Substation) పరిధిలో గల రాయిపల్లి, మద్రి గ్రామాల్లో గత వారం రోజులుగా తీవ్ర లో-వోల్టేజ్ సమస్య వేధిస్తోంది. దీంతో విసిగిపోయిన గ్రామస్థులు దిగ్వాల్ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు.

​గ్రామాల్లో లో-వోల్టేజ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. అక్కడే ఉన్న విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (AE)ను గ్రామస్థులు ఘెరావ్ చేసి, లో ఓల్టేజ్ సమస్యపై నిలదీశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>