కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు (Burgampadu) మండలంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీరామాపురం గ్రామం సమీపంలో ఇసుక లారీ ఒక ఆటోను ఢీకొనడంతో మొరంపల్లి బంజర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వెంకన్న గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి వెంకన్నను చికిత్స నిమిత్తం మొరంపల్లి బంజర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇసుక లారీల కారణంగా ఇటీవల ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే వేగ నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

