Mobile Popup Ad
Mobile Popup Ad

మణుగూరులో అదుపు తప్పి చెట్టుని గుద్దిన ట్రాక్టర్

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని మణుగూరు మండలం, కమలాపూర్ గ్రామంలో ఓ ఇసుక ట్రాక్టర్ దాదాపు ఇంట్లోకి దూసుకువచ్చేది. చెట్టు అడ్డు తగలడంతో చెట్టుకు తగిలి ఆగిపోయింది. మణుగూరు మండలం రాయిగూడెం నుంచి ఇసుక లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్ (Tractor) అదుపు తప్పి రోడ్డు దిగి చెట్టును ఢీకొట్టింది. ఒక వేళ ఆ చెట్టు ఏ మాత్రం బలహీనంగా ఉన్నా ఇంట్లోకి దూసుకెళ్లేదని.. తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందనీ స్థానికులు తెలిపారు.

మణుగూరు (Manuguru) మండలం గోదావరి నదికి సమీపంలో ఉండడం వలన ఇక్కడ సుమారు ఐదు వరకూ ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఈ ఇసుక రీచ్‌ల నుంచి కాంట్రాక్టర్లు పరిమితికి మించి అక్రమంగా ఇసుకను తరలిస్తుంటారు. దీంతో రోడ్లు అన్నీ గుంతల మయం అయ్యాయి. మరో పక్క ఫిట్‌నెస్ లేని బళ్ళు కావడంతో ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాలలో, మైనర్లతో ఇసుక రవాణా చేస్తుండడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Read Also: మాకేది గ్రౌండ్.. నిజామాబాద్‌లో జూడాల నిరసన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>