Mobile Popup Ad
Mobile Popup Ad

వీఎస్‌ఆర్‌తో హెరిటేజ్‌కు సంబంధం లేదు : లోకేష్

కలం, డెస్క్ : వీఎస్ ఆర్ ఏవియేషన్ కంపెనీతో హెరిటేజ్ (Heritage) కు సంబంధం లేదన్నారు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh). హెరిటేజ్ ఫిన్ లీస్ అనేది 1996లో స్థాపించినం సంస్థ అని.. మిగతా కంపెనీల లాగానే 2022లో వీఎస్ ఆర్ సంస్థ ఫైనాన్స్ తీసుకుందని చెప్పారు. అంతకు మించి ఆ కంపెనీలో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని మంత్రి లోకేష్ చెప్పారు. ఆ సంస్థ ఫైనాన్స్ తీసుకున్నప్పుడు.. మా ఎంపీ ఏవియేషన్ మినిస్టర్ అవుతాడని మేం అనుకున్నామా.. అజిత్ పవార్ వీఎస్ ఆర్ ఫ్లైట్ ఎక్కుతారని మాకేమైనా తెలుసా.. అవన్నీ యాధృచ్చికంగా జరిగాయి. వీఎస్ ఆర్ అందులో హెరిటేజ్ కు ఎలాంటి సంబంధం లేదు’ అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

కావాలనే వైసీపీ నేతలు తమ మీద బురద జల్లాలని చూస్తున్నారని.. బాబాయ్ ను చంపి మా చేతిలో కత్తి పెట్టినట్టే ఈ కేసును మాకు అంటగట్టాలని ప్రయత్నిస్తున్నారంటూ మంత్రి లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు. దీంతో లోకేష్ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read Also: మళ్లీ పార్టీలోకి వస్తే చెప్పుతో కొడతా.. కేతిరెడ్డి వార్నింగ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>