బీహార్​ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం..

కలం, వెబ్​ డెస్క్​ : బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి (Bihar CM)గా భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుడు సామ్రాట్ చౌదరి (Samrat Choudhary) ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో, బిహార్ రాష్ట్ర చరిత్రలోనే బిజెపికి చెందిన తొలి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టడం గమనార్హం. పాట్నాలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

మరోవైపు రాజకీయ సమీకరణాల్లో భాగంగా జనతాదళ్ (యునైటెడ్) సీనియర్ నేత బిజేంద్ర ప్రసాద్ యాదవ్ (Bijendra Prasad Yadav) ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో ఏర్పడిన ఈ నూతన కూటమి ప్రభుత్వం పాలనలో సరికొత్త మార్పులు తీసుకువస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పుతో బీహార్ రాజకీయాల్లో బీజేపీ తన పట్టును మరింత బలోపేతం చేసుకున్నట్లయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>