Mobile Popup Ad
Mobile Popup Ad

రవాణా శాఖ మంత్రి ఇలాకాలో బస్సు డ్రైవర్ల ఆందోళన

కలం, మెదక్ బ్యూరో: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత ఇలాకా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ (Husnabad)లో ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్న హుస్నాబాద్‌లోనే తమపై దాడి జరిగిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీతాలను పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే దౌర్జన్యం చేసి తమపై దాడి చేశారని ఆందోళన చేపట్టారు. దీంతో హుస్నాబాద్ డిపోకు చెందిన ప్రైవేటు బస్సులను నిలిపివేశారు. తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేస్తూ డిపో ముందు వారు నిరసన తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>