Mobile Popup Ad
Mobile Popup Ad

కాజీపేటలో రెచ్చిపోతున్న చైన్ స్నాచ‌ర్లు.. బైక్‌పై వ‌చ్చి చోరీ!

కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ జిల్లా కాజీపేట (Kazipet)లో చైన్ స్నాచ‌ర్లు రెచ్చిపోతున్నారు. ఇటీవ‌ల జ‌రుగుతున్న వ‌రుస‌ ఘ‌ట‌న‌లు ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. తాజాగా బుధవారం మ‌రో ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. బాపూజీ నగర్‌లో కారుణ్య క్లినిక్ వద్ద ఒక మహిళ పని ముగించుకొని ఇంటికి వెళ్తోంది. ఈ క్ర‌మంలో బైక్ మీద వచ్చిన గుర్తు తెలియని వ్య‌క్తులు ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లి పోయారు. మ‌హిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మ‌రోవైపు కొద్ది రోజులుగా వరంగల్ నగరంలో వరుస చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన కొద్ది గంటల్లోనే కాజీపేట‌లో మరో చోరీ జరగడం కలకలం రేపుతోంది.

Read Also: లవర్​ మోజులో.. భర్తను కడతేర్చిన భార్య!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>