కలం, మామడ : మామడ (Mamada Road Accident) మండల కేంద్రంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని కారు వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పోశెట్టి, రత్నయ్య టీవీఎస్ ఎక్సెల్‌పై రోడ్డు దాటే క్రమంలో ఖానాపూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్సెల్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సురేష్, రాజేష్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

