వ్యాపార సముదాయాల్లో పార్కింగ్ సౌకర్యం తప్పనిసరి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్ : జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector ) అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పట్టణాల్లో వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వ్యాపార సముదాయాలన్నింటిలో నిబంధనల ప్రకారం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వాహనాలను రహదారులపై ఇష్టానుసారంగా నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్ నిబంధనలు ఉల్లంఘించే వ్యాపార సంస్థలు, వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, రహదారులపై వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, వెంకట మాధవరావు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఎస్పీ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>