కలం, వెబ్ డెస్క్: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును కూటమి సర్కార్ నిర్వీర్యం చేసిందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులో వైసీపీ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి సజ్జల మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు చంద్రబాబు పాలనలో నిర్లక్ష్యానికి గురవుతోందని ఆరోపించారు. తన స్వలాభం కోసం చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టును రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ డీల్ గా మార్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు (Rayalaseema Lift Project) ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించడంతో పాటుగా.. ప్రాజెక్టు కోసం పోరాటాన్ని బలోపేతం చేయడానికి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని సజ్జల (Sajjala) చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టు నిలిపివేయడం వల్ల కలిగే నష్టాలను రాష్ట్ర ప్రజానీకానికి వివరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంపై చేసిన పోరాటం కంటే మరింత తీవ్రంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధి, ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాధాన్యంపై మేధావులు, విద్యావంతుల మధ్య విస్తృత చర్చ జరగాలని వ్యాఖ్యానించారు.
Read Also: అక్రమంగా ఉద్యోగాలు.. గవర్నర్ సంచలన నిర్ణయం
Follow Us On: Instagram

