కలం, నిర్మల్ : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో శనివారం సాయంత్రం లచ్చిరాం నివాసంలో సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్‌రెడ్డి మాట్లాడారు.
సాయి భక్తుల కోరిక మేరకు ప్రతి శనివారం వారి నివాసాల్లో సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. భక్తి భావనతో నిర్వహించే ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

