కలం, వెబ్ డెస్క్ : డిసెంబర్ 19న రిలీజ్ కావాల్సిన “సఃకుటుంబానాం” (Sahakutumbaanaam) మూవీ వాయిదా పడింది. ఉదయ్ శర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్నారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు.
ఈ “సఃకుటుంబానాం(Sahakutumbaanaam)” మూవీని మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు పాజిటివ్ టాక్ వచ్చిందని మూవీ టీమ్ చెబుతోంది. రిలీజ్ కు ఒక రోజు ముందు వాయిదా వేయడానికి అనుకోని కారణాలు ఎదురయ్యాయని మూవీ టీమ్ చెప్పింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాకు మణి శర్మ సంగీతం అందించారు.
Read Also: 21న బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలె.. చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి ?
Follow Us On: Sharechat


