కలం, వెబ్ డెస్క్ : ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’ (కానీ చాలా మంచోళ్లు) (Bad Girls) సినిమా టీజర్‌ను గురువారం డైరెక్టర్ బుచ్చిబాబు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడారు. ‘ఈ బ్యాడ్ గాళ్స్ కథను మున్నా చెప్పారు. చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి కూడా అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఈ సినిమాలో రేణు దేశాయ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఆమె ఈ సినిమా ఒప్పుకున్నారు అంటే సినిమా ఎంత బాగుంటుందో తెలుస్తుంది. డిసెంబర్ 25న విడుదల అవుతుంది తప్పక చూడండి” అని బుచ్చిబాబు చెప్పారు.
బ్యాడ్ గాళ్స్(Bad Girls) సినిమా దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ “‘బ్యాడ్ గాళ్స్’ పూర్తి ఎంటర్టైనర్ చిత్రం. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం. సినిమా టీజర్ ని బుచ్చి బాబు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు. ఈ సినిమా (Bad Girls Movie) ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై తెరకెక్కుతుండగా.. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also: 21న బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలె.. చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి ?
Follow Us On : WhatsApp


