Mobile Popup Ad
Mobile Popup Ad

టాబ్లెట్లు వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే ప్రమాదమే!

కలం, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆరోగ్య సమస్యల కారణంగా మందులు (టాబ్లెట్లు) మన జీవితంలో ఒక భాగమైపోయాయి. చిన్న తలనొప్పి నుండి పెద్ద జబ్బుల వరకు ప్రతిదానికీ మనం టాబ్లెట్లను వాడుతుంటాం. మందులు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. అయితే వాటిని సరైన విధంగా తీసుకోకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

మందులు కొనేటప్పుడు, వేసుకునేటప్పుడు (Medicine Usage) చాలా మంది తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఆ పొరపాట్లే మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డాక్టర్ సలహా లేకుండా మందులు వాడటం

చిన్న పిల్లలకు లేదా పెద్దవాళ్లకు జ్వరం, దగ్గు, జలుబు వచ్చినప్పుడు చాలామంది డాక్టర్ సలహా లేకుండా స్వయంగా మెడికల్ షాపుకు వెళ్లి మందులు కొని వాడేస్తుంటారు. ఇలా చేయడం ప్రమాదకరమని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. దీనివల్ల శరీరంపై దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందట.

మధ్యలోనే మందులు ఆపడం

కొంతమందికి ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడగానే మధ్యలోనే యాంటీబయాటిక్ మందులు వాడటం ఆపేస్తుంటారు. దీంతో ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకుండా మళ్లీ తీవ్రమయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

సమయపాలన లేని మందుల వాడకం

కొంతమంది మందులను డాక్టర్ చెప్పిన సమయానికి కాకుండా ఆలస్యంగా వాడుతారు. మరికొందరు ఖాళీ కడుపుతో తీసుకుంటారు. అలా ఇష్టమొచ్చినప్పుడు వాడటం మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఎక్స్‌పైరీ (Expiry) డేట్ అయిపోయిన మందులు వాడటం కూడా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

మందులను ఎక్కువగా వాడటం

కొంతమంది ఎక్కువగా పెయిన్‌కిల్లర్స్‌ను వాడుతుంటారు. దీనివల్ల మూత్రపిండాలు, కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఫ్యూచర్‌లో కిడ్నీ, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

జెనరిక్ vs బ్రాండెడ్ మందులు: అసలు తేడా ఏంటి?

జెనరిక్‌, బ్రాండెడ్‌ మందుల్లో ఉండే మెడిసిన్ పదార్థం ఒకటే. వీటి మధ్య తేడా ప్రధానంగా కంపెనీ పేరు, ధరలో మాత్రమే ఉంటుంది. డాక్టర్‌ సూచనల మేరకు సరైన విధంగా వాడితే జెనరిక్‌ మందులు కూడా బ్రాండెడ్‌ మందుల్లాగే ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>