Mobile Popup Ad
Mobile Popup Ad

ఇద్దరు పిల్లలను ప్రాజెక్టులో తోసేసి.. ఆపై తండ్రి ఆత్మహత్య

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ (Nizamsagar) ప్రాజెక్టులో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట‌కు చెందిన కృష్ణ‌(32) తన కుమారుడు రక్షిత్​ (9), కుమార్తె అన‌న్య‌ (5)తో కలిసి గురువారం నిజాంసాగర్​ ప్రాజెక్ట్ వద్దకు వచ్చాడు. సాయంత్రం వరకు ప్రాజెక్ట్​ వద్ద పిల్లలతో సరదాగా గడిపాడు. అనంతరం ముగ్గురు అక్కడ భోజనాలు సైతం చేశారు. ఒక్కసారిగా సాయంత్రం పూట ఇద్దరు పిల్లలను తండ్రి నీటిలో తోసేసి తాను కూడా దూకాడు. కుటుంబ కలహాల కారణంగా ఆయన పిల్లలతో కలిసి సూసైడ్​ చేసుకున్నట్లు భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఎన్డీఆర్​ఎఫ్​, అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపారు. శుక్రవారం ఉదయం ఆరేడు శివారులోని 20 గేట్ల వద్ద మృతదేహాలు లభ్యమయ్యాయి. ముగ్గురి మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, బంధువుల తీవ్రంగా రోదించారు. ముక్కుపచ్చలారని ఆ పసి పిల్లలు ఏం పాపం చేశారని గుండెలవిసేలా రోదించడం అందరినీ కలిచి వేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>