కలం, వెబ్డెస్క్: నేపాల్లో ఆకస్మిక వరదలు (Nepal Floods) తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. వరదల్లో మొత్తం 19 దేశాలకు చెందిన వందలాది మంది గల్లంతయ్యారు. వీరిలో 300 మంది భారతీయులు కూడా ఉన్నారు. సుమారు 200లకు పైగా పర్యాటకులు మృతి చెందారు. ఈ వరదల్లో ఈషా ఫౌండేషన్ సభ్యులు గల్లంతైనట్లు సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev) వెల్లడించారు. ఈషా నుంచి 300 మంది కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. ఆకస్మిక వరదల్లో 77 మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని చెప్తూ సద్గురు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సద్గురు ప్రస్తుతం టిబెట్ ఉన్నారు. అక్కడి నుంచి గైరాంగ్కు వెళ్లేందుకు తనకు అనుతి ఇవ్వాలని చైనా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి తమ వారి కోసం గాలింపు చర్యలు చేపడతామంటున్నారు. అలాగే, సహాయక చర్యల్లో కూడా పాల్గొంటామని చెప్తున్నారు. సద్గురు విజ్ఞప్తికి ఇంకా చైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరో వైపు నేపాల్ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య మరింత ఆందోళన కలిగిస్తోంది.

