తమిళనాడు గవర్నర్‌గా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి?

కలం, వెబ్ డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని (Nallari Kiran Kumar Reddy) తమిళనాడు గవర్నర్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఇన్‌చార్జ్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. అయితే త్వరలోనే పూర్తిస్థాయి గవర్నర్‌ నియామకం జరగవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు గవర్నర్‌గా రాజకీయ అనుభవం ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తమిళనాడు రాజకీయాల్లో చురుగ్గా మారిన నేపథ్యంలో కేంద్రం వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్‌తో కిరణ్‌కుమార్‌రెడ్డికి ఉన్న పరిచయాలు.. టీవీకేను ఎన్‌డీఏ (NDA) కూటమి వైపు ఆకర్షించేందుకే ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను అనుకూలంగా మలుచుకోవడంలో భాగంగానే కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>