కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ (Irumudi) మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసింది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో నటించిన నటీనటులకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘ఇరుముడి’ మూవీపై అదిరిపోయే ట్వీట్ చేశారు.
‘‘కంగ్రాట్స్ మై డియర్ బ్రదర్ రవి. ఈ మూవీలో నీ నటన చాలా అద్భుతంగా ఉంది. సినిమాను పూర్తిగా భుజస్కంధాలపై మోశావు. ఇరుముడి ఆద్యంతం ఉత్కంభభరితంగా ఉంది. శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తనదైన స్టైల్లో తెరకెక్కించారు. కథలోని డెప్త్, ఎమోషన్స్ తెరపై ఆవిష్కరించిన తీరు ఎంతగానో బాగుంది.
ఇక చిన్నారి నక్షత్ర క్యూట్ నటన ఆకట్టుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ ఏమాత్రం రాజీపడకుండా నిర్మించారు. ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ.. ఏ కొందరిదో కాదు. మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

