కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాలో రైతులను యూరియా (Urea) కష్టాలు వెంటాడుతున్నాయి. కొత్తగా వచ్చిన యాప్ ద్వారా యూరియా దొరకక రైతులు ఆందోళన (Farmers Protest) బాటపడుతున్నారు. రామాయంపేట మండలం కోనాపూర్ పిఎసిఎస్ ద్వారా 560 బస్తాల యూరియా రావడంతో క్షణాల్లోనే బుకింగ్ పూర్తయింది. యూరియా కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతులకు ఒక్క బస్తా యూరియా కూడా బుక్ కాకపోవడంతో రైతులు రాస్తారోకో చేపట్టారు.
మెదక్-సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం యాప్ ద్వారా కాకుండా, షాపుల ద్వారా యూరియా విక్రయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పంటలకు యూరియా అవసరమయ్యే సమయంలో యూరియా లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

