నేపాల్ లో విధ్వంసానికి కారణం ఇదేనా..?

కలం, వెబ్ డెస్క్ : నేపాల్, చైనా సరిహద్దు ప్రాంతంలో మంచు పర్వతం విరిగిపడటంతోనే భారీ విధ్వంసం సంభవించింది. చైనాకు చెందిన హెలికాప్టర్ ద్వారా చేపట్టిన సర్వేలో హిమానీనదం విరిగిపడిన ప్రాంతం, నీరు విడుదలైన తీరు బయటపడింది. హిమానీనదం, కొండచరియలు విరిగిపడి నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో అక్కడ తాత్కాలికంగా పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. ఆ తర్వాత ఆ సహజ సిద్ధమైన కట్ట తెగిపోవడంతో వేలాది క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు దూసుకువచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు.

దీనిని సాంకేతిక పరిభాషలో GLOF (GLOF In Nepal) అంటే గ్లేసియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్ అని పిలుస్తారు. పర్వతాలపై మంచు లేదా రాళ్ల అడ్డుగోడ హఠాత్తుగా విరిగిపోయినప్పుడు, అందులోని నీటితో పాటు టన్నుల కొద్దీ మంచు, రాళ్లు, మట్టి, బురద వేగంగా కిందికి కొట్టుకొస్తాయి. ఈ హఠాత్ పరిణామం వల్ల నేపాల్‌లోని దిగువ గ్రామాలు, రవాణా మార్గాలు దెబ్బతిన్నాయి. ప్రకృతి ప్రకోపానికి మనుషుల మౌలిక సదుపాయాలు ఎంత దారుణంగా దెబ్బతింటాయో ఈ ఘటన మరొకసారి స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>