అచ్చంపేటలో మున్సిపల్ అధికారుల కొరడా.. రోడ్లపై తోపుడుబండ్లు తొలగింపు!

కలం, అచ్చంపేట: ప్రధాన రహదారులపై పండ్లు, కూరగాయల బండ్లను తొలగించాలని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ కూడలితోపాటు పోస్టాఫీస్, కోర్టు, ఆసుపత్రి, బస్టాండ్ ప్రాంగణం, తదితర ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా పండ్ల బండ్లు, కూరగాయల దుకాణాలును నిర్వహిస్తున్నారు. వాహనారుల సౌకర్యార్థం ఆ దుకాణాలను పోలీసుల సహకారంతో బుధవారం తొలగించాలని అచ్చంపేట మున్సిపల్ (Achampet Municipality) అధికారులు ఆదేశించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ.. పట్టణంలో ప్రధాన రహదారికి ఇరువైపులా రోడ్లపైకి వివిధ రకాల తోపుడుబండ్లు, దుకాణాలు ఏర్పాటు చేయడం వలన తరచూ వాహనదారులు రోడ్లపై ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ కార్యాలయాల ముందు రోడ్లపైకి బండ్లు పెట్టడం వలన అక్కడికి వచ్చిన వినియోగదారులు, బాధితులు తమ బండ్లను పార్క్ చేయడానికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని గుర్తు చేశారు. అందుకే గంట సమయంలో బండ్లు దుకాణాలన్నీ ఖాళీ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>