Mobile Popup Ad
Mobile Popup Ad

తిడితే పెట్టుబడులు వస్తాయా..? సీఎంపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను తిట్టడానికే సీఎం రేవంత్ రెడ్డి సమయం వృధా చేస్తున్నారని.. పెట్టుబడుల సదస్సులో సీఎం ప్రతిపక్షాలను తిడితే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా అని బీఆర్ఎస్ మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని.. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై వేధింపులు తప్ప శాంతిభద్రతలపై దృష్టిపెట్టడం లేదని ఆమె ఆరోపించారు.

కేసీఆర్ (KCR) హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో హోంశాఖ మంత్రి బాధ్యతలను రేవంత్ విస్మరించారని సబిత ఫైర్ అయ్యారు. తెలంగాణలో పట్టపగలు హత్యలు జరుగుతున్నాయని.. మాజీ ఐపీఎస్ సతీమణిని హత్య చేశారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ చెప్తున్నాయని తెలిపారు.

2023 కంటే 2024 లో 34 వేల కేసులు పెరిగాయని.. రాష్ట్రంలో 18.4 శాతం క్రైమ్ రేట్ పెరిగిందని సబిత వివరించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇలాఖా కరీంనగర్‌లో (Karimnagar) పట్టపగలు గోల్డ్ షాప్‌లో చోరీ జరిగిందన్నారు. మహిళలు, చిన్నారులపై దాడుల్లో తెలంగాణ దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం నేరాలకు కేంద్రంగా మారిందన్నారు.

రేవంత్ రెడ్డి.. హోం శాఖా మంత్రిగా, విద్యా శాఖా మంత్రిగా, మున్సిపల్ శాఖా మంత్రిగా ఫెయిల్ అయ్యారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రతిష్టను కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చింది అని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్లకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లడం ద్వారా పోలీసులు తమ పనులు చేసుకోలేకపోతున్నారని.. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని సబిత ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) అన్నారు.

Read Also: పాలమూరు ప్రాజెక్టుపై కవిత పోరు : దసరా డెడ్ లైన్!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>