15 ఏళ్ల అమ్మాయికి నలుగురు బాడీగార్డ్స్.. ఎందుకో తెలుసా?

కలం, వెబ్ డెస్క్: గుజరాత్‌లోని (Gujarat) అహ్మదాబాద్‌కు చెందిన ఓ సంపన్న కుటుంబం తమ 15 ఏళ్ల కుమార్తె రక్షణ కోసం ఏకంగా నలుగురు బౌన్సర్లను (Bouncers) పెట్టుకుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ బాలిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంతో ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, కొంతకాలంగా అమ్మాయికి గుర్తుతెలియని వ్యక్తుల నుండి వేధింపులు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కేవలం ఆన్‌లైన్ వేధింపులే కాకుండా, కొందరు ఆమెను వెంబడించడంతో కుటుంబ సభ్యులు కఠిన నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఆ బాలిక ఎక్కడికి వెళ్లినా ఈ నలుగురు బౌన్సర్లు ఆమెకు రక్షణగా ఉంటున్నారు. పాఠశాలకు వెళ్లేటప్పుడు, ట్యూషన్స్, స్నేహితులతో బయటకు వెళ్లేటప్పుడు కూడా బౌనర్స్ ఆమె వెంటే ఉంటున్నారు. సైబర్ వేధింపుల తీవ్రత పెరగడం వల్లే తాము ఇంత భారీ ఖర్చుతో కూడిన ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆ బాలిక తండ్రి మీడియాకు వివరించారు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పాపులారిటీ వల్ల టీనేజర్లకు ఎదురవుతున్న భయాలకు ఈ ఘటన ఓ ఉదాహరణ.

Read Also: పాలమూరు ప్రాజెక్టుపై కవిత పోరు : దసరా డెడ్ లైన్!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>