కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా (Rythu Bharosa) రెండో విడత నిధుల పంపిణీకి తేదీని ఖరారు చేసింది. ఈ నెల 20న సోమవారం రోజు రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. రైతులకు పెట్టుబడి కోసం ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలోని 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది. ఎకరానికి రూ.6 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది.
ఏప్రిల్ 20వ తేదీన భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సమక్షంలో ఈ నిధులు విడుదల చేస్తారు. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ గత నెల 23వ తేదీన మొదటి విడత రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతి రైతుకు ఒక ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయం కింద రూ.6 వేల చొప్పున ముందుగా విడుదల చేసింది. దాదాపు రూ.3,590 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. రెండో విడతలో 45,11,947 మంది రైతులు రైతు భరోసా (Rythu Bharosa) సాయం అందుకోనున్నారు. దీంతో రూ.5653 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతం, మూడో విడత నిధులను వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Read Also: సీఎం జోలికి రావొద్దు.. జీవన్ రెడ్డికి మంత్రి అడ్లూరి స్ట్రాంగ్ వార్నింగ్!
Follow Us On: Pinterest

