కలం మెదక్ బ్యూరో: తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వర్తించేందుకు సంగారెడ్డి (Sangareddy) నుంచి హోమ్ గార్డ్స్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ (SP Paritosh Pankaj) మెడికల్ కిట్లు, కనీస అవసరాల కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. దూర ప్రాంతాలలో విధులు నిర్వహించేందుకు వెళుతున్న సిబ్బంది బాగోగులను దృష్టిలో ఉంచుకొని, అవసరమైన ప్రాథమిక ఔషధాలు, బిస్కెట్స్, వ్యక్తిగత అవసరాల సామగ్రి అందుబాటులో ఉండేలా ఈ కిట్లు అందజేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే విధుల్లో అప్రమత్తంగా ఉండి, ఎలాంటి పరిస్థితులను అయిన సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ (SP Paritosh Pankaj) సిబ్బందికి సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, సంగారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాక్షించారు.
Read Also: సీఎం జోలికి రావొద్దు.. జీవన్ రెడ్డికి మంత్రి అడ్లూరి స్ట్రాంగ్ వార్నింగ్!
Follow Us On: Instagram

