జోగిపేటలో దారుణం.. 18 రోజుల పసికందుకు ఇంతటి శిక్షా..?

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా జోగిపేట (Jogipet) లో భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవ ఓ పసిప్రాణాన్ని బలితీసుకుంది. కన్న తండ్రే కసాయిగా మారి, కేవలం 18 రోజుల వయసున్న మగ శిశువును నేలకేసి కొట్టి దారుణంగా హత్య చేశాడు. జోగిపేటలోని వాసవినగర్ కాలనీలో కృష్ణ, గౌరీ దంపతులు నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య తీవ్ర కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య మరోసారి పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది.

భార్య గౌరీపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన భర్త కృష్ణ, విచక్షణ కోల్పోయి 18 రోజుల మగ శిశువును ఒక్కసారిగా నేలకేసి కొట్టాడు. దీంతో ఆ పసికందు తలకు తీవ్ర గాయాలై పరిస్థితి అత్యంత విషమంగా మారింది. కుటుంబ సభ్యులు వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే లోపే మార్గమధ్యంలోనే ఆ పసికందు ప్రాణాలు విడిచాడు. ప్రస్తుతం చిన్నారి మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>