Mobile Popup Ad
Mobile Popup Ad

చంద్రబాబుపై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

కలం, వెబ్ డెస్క్ : దేశంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన మీడియా చిట్‌చాట్‌ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీహర్ లో నితీష్ కుమార్, మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండేలా పరిస్థితి మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి.. భవిష్యత్ లో టీడీపీ, చంద్రబాబు (Chandrababu) పరిస్థితి కూడా అదే అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీజేపీకి కేంద్రంలో తక్కువ సీట్లు ఉన్నాయని, కాబట్టి టీడీపీకి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో బీజేపీ బలం పెరిగితే టీడీపీ పక్కనపెడతారని సంచలన ఆరోపణ చేశారు.

లోక్ సభ, రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయడానికే మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. అయితే వాటిని ఇంప్లిమెంట్ చేసేది స్థానికంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు అధికార యంత్రాంగం అని చెప్పారు. 2/3 మెజార్టీ వచ్చినంత మాత్రాన అన్నింటిని చట్టాలు చేయలేమని.. కేంద్రంలో మెజార్టీ ఉందని ప్రధానిగా ఉన్న ఎవరైనా తనకు తాను రాజుగా 2/ 3 మెజార్టీతో చట్టం చేసుకుంటే ఒప్పుకోరు కదా అని ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు డిక్టేటర్ షిప్ ని ఎవరు ఒప్పుకోరని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో అపోజిషన్ కి కేవలం 11 సీట్లే ఉన్నాయని గుర్తు చేశారు. అలా అని తానే రాజు అని చంద్రబాబు చట్టం తీసుకొస్తే ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Read Also: రైతుల‌కు గుడ్ న్యూస్‌.. రైతు భ‌రోసా రెండో విడ‌త‌కు డేట్ ఫిక్స్‌!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>