Mobile Popup Ad
Mobile Popup Ad

చెన్నై పోరాటం.. గుజరాత్ టార్గెట్ 159

కలం, స్పోర్ట్స్​ : చెపాక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌ (CSK vs GT)లో చెన్నై సూపర్ కింగ్స్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. ఒకానొక దశలో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించిన చెన్నైని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.

చెన్నై ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్ సంజూ శాంసన్ (11) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా, ఆ తర్వాత వచ్చిన ఊర్విల్ పటేల్ (4), సర్ఫరాజ్ ఖాన్ (0) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డెవాల్డ్ బ్రెవిస్ (2) కూడా నిరాశపరచడంతో 37 పరుగుల వద్దే నాలుగో వికెట్ పడింది. ఈ దశలో శివమ్ దూబే (22) తో కలిసి గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. దూబే అవుట్ అయిన తర్వాత కార్తీక్ శర్మ (15), జేమీ ఓవర్టన్ (18) మెరుపులు మెరిపించడంతో స్కోరు బోర్డు కదిలింది.

ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం నిలకడగా ఆడాడు. 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు.

Read Also: టీమిండియాలోకి వైభవ్ అప్పుడే వద్దు: కార్లోస్ బ్రాత్‌వైట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>