కలం, వెబ్ డెస్క్: రష్యన్ ప్యాసెంజర్ (Russian Passenger) ఫ్లైట్‌లో బట్టలు విప్పి హల్ చల్ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వియత్నాం నుంచి బ్యాంకాక్‌కి బయలుదేరిన ఎయిర్‌ఏషియా ఫ్లైట్ 647లో ప్యాసెంజర్ అసభ్య ప్రవర్తన కారణంగా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అండర్వేర్‌లో ఉన్న ఓ వ్యక్తి ఫ్లైట్ సిబ్బందిని తాళాలు తెరవమని, విమానం ల్యాండింగ్ చేయాలని భయాభ్రంతులకు గురిచేశాడు. ఈ క్రమంలో తోటి ప్రయాణికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, డోన్ట్ టచ్ మీ అంటూ కేకలు వేశాడు.
అక్కడితో ఆగకుండా విమానమంతా తిరిగాడు. తోటి ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి తిట్టాడు. ఫ్లైట్ డాన్ ముయాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, బ్యాంకాక్ (Bangkok)లో ల్యాండ్ అయ్యాక ఎయిర్‌స్టెయిర్స్ రాకముందే దూకేశాడు. దీంతో అతని (Russian Passenger) కాలికి గాయమైంది. పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఫ్లైట్‌లో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు అతనికి జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
Read Also: అమెరికాను వెనక్కి నెట్టిన భారత్.. గ్లోబల్ జీడీపీపై మస్క్ ట్వీట్
Follow Us On : WhatsApp


