కలం, నిర్మల్: గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, స్వాభిమానం కోసం జీవితాంతం పోరాడిన మహా విప్లవ వీరుడు భగవాన్ బీర్సా ముండా (Birsa Munda) జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పండిట్ జాదవ్ పిలుపునిచ్చారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జయంతి వేడుకల నిర్వహణపై జిల్లా కార్యశాల నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం బీర్సా ముండా చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి త్వరలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల రవీందర్ రెడ్డి, ఎస్టీ మోర్చా నాయకులు ఇస్లావత్ మోహన్ నాయక్, సూరజ్ నాయక్, సంతోష్ నాయక్, కిషోర్, ప్రకాష్ నాయక్, గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

