Mobile Popup Ad
Mobile Popup Ad

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌ పర్యటన ఖరారు

కలం, వెబ్ డెస్క్: రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) భారత్ పర్యటనకు రాబోతున్నారు. సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో ఆయన పర్యటిస్తారని క్రెమ్లిన్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తుండగా.. సభ్య దేశమైన రష్యా అధ్యక్షుడి హోదాలో పుతిన్ దీనికి హాజరు కాబోతున్నారు. 2025 డిసెంబరులో భారత్‌కు వచ్చిన పుతిన్.. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మరోసారి ఇక్కడకు రాబోతుండటంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయ్యాక, ఎన్నో మిత్ర దేశాల నుంచి ఆహ్వానాలు వచ్చినా తిరస్కరిస్తూ వస్తున్న పుతిన్.. భారత్‌లో రెండు పర్యటనలు చేయనుండటం గమనార్హం.

బ్రిక్స్ కూటమి అంటే..

బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాల ఆంగ్ల అక్షరాలను కలిపి బ్రిక్స్ కూటమిగా పిలుస్తుంటారు. 2009 జూన్ 16న రష్యా చొరవతో ఏర్పడిన ఈ కూటమి ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ, అంతర్జాతీయ పరిణామాలను చర్చించుకునే కూటమి. వాస్తవానికి ఈ కూటమిలో తొలుత దక్షిణాఫ్రికా లేదు. అప్పటివరకు బ్రిక్ గా పిలిచేవారు. 2010లో సౌతాఫ్రికా చేరికతో బ్రిక్స్ కూటమిగా అవతరించింది. ప్రతి ఏడాది ఒక్కో సభ్య దేశంలో సదస్సు నిర్వహిస్తూ వస్తుంటారు. గతేడాది 17వ సదస్సు బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో జరగ్గా, ఇప్పుడు ఇండియాలో జరుగనుంది. దీనికే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరు కాబోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>