కలం, వెబ్ డెస్క్ : ఉక్రెయిన్ పై రష్యా మరోసారి దాడికి దిగింది (Russia Attacks Kyiv). ఆదివారం ఉదయం ఉక్రేయిన్ రాజధాని కీవ్ పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ డాడిలో ఒకరు మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. పాఠశాలలు, నివాస భవనాలు దెబ్బ తినడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆక్రమిత లుహాన్స్క్‌లోని స్టారోబిల్స్క్ వసతి గృహంలో జరిగిన ఘటనకు ప్రతీకారంగా రష్యా ఈ దాడి చేసిందని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు.
కాగా, ఉక్రెయిన్ రాజధానిలో ఉద్రిక్తతలు పెరగడం పౌరుల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. రష్యా దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా ఖండించారు. రష్యా హైపర్‌సోనిక్ ఒరేశ్నిక్ క్షిపణిని ఉపయోగించి దాడి చేసిందని ఆయన ఆరోపించారు. అయితే పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోలేదని ఇరుపక్షాలు ఖండించాయి.
Read Also: 16 ఏళ్ల కోడి లైఫ్ స్టైల్ చూస్తే షాక్ అవుతారు.. ఏసీ నుంచి ద్రాక్ష పండ్లు వరకు!
Read Also: ఆమెకు రక్షణేది..?

