మత్స్యగిరి దేవస్థాన పాలకవర్గం నియామకం

కలం, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో కొలువైన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (Matsyagiri Temple) నూతన పాలకవర్గం నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఈ నూతన పాలకవర్గం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ ఎన్నిక కావడం దాదాపు ఖాయమైంది, ఇది కేవలం లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కమిటీ ఏర్పాటు పూర్తి కావడంతో భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎన్నుకోబడిన ఈ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈ నెల 27వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

Read Also: రెండు చోట్లా ఓట్లు.. సీఎం రేవంత్ క్లారిటీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>