కలం, వెబ్‌డెస్క్: ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్ వైద్య సేవ (NTR Vaidya Seva)కు భారీగా నిధులు కేటాయిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 బడ్జెట్ అంచనాల నుంచి రూ.1000 కోట్లు నిధులు కేటాయించేందుకు పరిపాలన అనుమితినిస్తూ నిర్ణయం తీసుకుంది. పథకం నిర్వహణ, వైద్య ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని కేటాయించారు. నిధుల వినియోగానికి వైద్య విద్యాశాఖ డైరెక్టర్‌కు అనుమతులు అందజేశారు.

