కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీ కార్మికులకు మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) కీలక విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వంతో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలని శ్రీధర్ బాబు కోరారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ మేరకు గురువారం మంత్రి శ్రీధర్ బాబు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రాణాలు తీసుకునే అనాలోచిత చర్యలకు పాల్పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
క్షణికావేశంతో కొత్త సమస్యలు వస్తాయని, ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి బలి కావొద్దని కోరారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వెంటనే చర్చలకు ముందుకు రావాలని కార్మిక సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. కార్మికులు ఆత్మనిబ్బరంతో ఉండాలని… ప్రభుత్వంతో చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని (Sridhar Babu) సూచించారు.
Read Also: సింగరేణి ఉద్యోగులకు ఎస్బీఐతో కొత్త బీమా ఒప్పందం
Follow Us On: Sharechat

