Mobile Popup Ad
Mobile Popup Ad

మందమర్రిలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా.. తప్పిన పెను ప్రమాదం!

కలం, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడడం (Mandamarri Bus Accident) తీవ్ర కలకలం రేపింది. ఈ బస్సులో ఒక్క ప్రయాణికుడే ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్, ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లికి వెళ్లున్న ఆర్టీసీ బస్సు మందమర్రి చేరుకోగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో ఆర్టీసీ బస్సు నియంత్రణ కోల్పోయి కేకే ఓపెన్ కాస్ట్ సమీప జాతీయ రహదారి పై బోల్తా పడింది. బస్సులో ఉన్న ప్రయాణికులు అంతకుముందే గమ్యస్థానాల్లో దిగిపోవడంతో ఒక్క ప్రయాణికుడే బస్సుల్లో ఉండడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని గాయలపాలైన డ్రైవర్, ప్రయాణికుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ప్రమాదంపై (Mandamarri Bus Accident) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: మరోసారి పెరిగిన డొమెస్టిక్ సిలిండర్ ధర..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>